Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహా రుద్రయాగ కమిటీకి ఘన సన్మానం..

మహా రుద్రయాగ కమిటీకి ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
పరకాల కుంకుమేశ్వర ఆలయ మహారుద్ర యాగ కమిటీని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ శాలువాలతో ఘనంగా సన్మానించారు. పరకాల పట్టణంలో నవంబర్ 3 సోమవారం రోజున శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో కార్తీక మాస మహా రుద్రయాగ మహోత్సవం ఏర్పాటు చేయనున్నారు. ఈ మహా రుద్రయాగానికి సోదా రామకృష్ణను హనుమకొండలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మహా రుద్రయాగ కమిటీ సభ్యులు రామకృష్ణను మహా రుద్ర యాగంలో కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కార్యాన్ని విజయవంత చేయాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. దాంతో రామకృష్ణ స్పందిస్తూ ఈ మహా రుద్ర యాగానికి నా వంతు సహకారాలు అందిస్తానని ఈ యాగానికి కావలసిన సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తానని, కమిటీ సభ్యులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహా రుద్ర యాగ కమిటీ సభ్యులు కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, ఎర్రం లక్ష్మణ్, పిట్ట వీరస్వామి, పంచగిరి శ్యామ్, గందె రవి, ఆలయ డైరెక్టర్ తోట రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -