Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్త్రిశక్తి పీఠం ఆశీస్సులు అందరిపై ఉండాలి.

త్రిశక్తి పీఠం ఆశీస్సులు అందరిపై ఉండాలి.

- Advertisement -

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
నవతెలంగాణ – మల్హర్ రావు:
త్రిశక్తి పీఠం అమ్మవార్ల ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కోరుకున్నారు.మండలం వల్లెంకుంట గ్రామంలో కొలువైన జంబూద్వీప శక్తి పీఠపాలిత త్రిశక్తి పీఠ దేవస్థానంను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌తో కలిసి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు మారుమూల ప్రాంతమైన వల్లెంకుంటలో అనేక ఏండ్లుగా త్రిశక్తి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారన్నారు.నవరాత్రోత్సవ సందర్బంగా సతీష్ భవానీ దీక్షలు చేపట్టడం అనవాయితీగా వస్తోందని, అయితే గౌరీమాతను పూజించడం మన తెలంగాణ ప్రాంతంలో గొప్ప సంప్రదాయమన్నారు. గౌరీ మాత అంటేనే అనేక రూపాలకు నిర్ణయకర్త అని, అలాంటీ దేవతల శక్తి పీఠం గొప్పగా నిర్వహిస్తున్నారని తెలిసి తాము వచ్చి దర్శించుకున్నామని, దర్శనం తర్వాత గొప్ప అనుభూతి కలిగిందని ఆయన తెలిపారు. అనంతరం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ జంబూద్వీప శక్తి పీఠం ద్వారా అర్చకులు సతీష్‌ గొప్పగా కార్యక్రమాలను నిర్వహిస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునే అవకాశం కల్పించారన్నారు. ప్రజలకు దేవుడికి అనుసంధాన కర్తగా ఉంటూ గొప్ప ఫలితాలు వచ్చేలా పూజలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు.దుర్గామాత తొమ్మిది రోజుల ఉపవాస దీక్షను చేపట్టిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శక్తిపీఠం గురించి తెలుసుకుని అమ్మవార్లను దర్శించుకునేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. శక్తి పీఠం కృపాకటాక్షాలు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని ఆయన ఈ సందర్బంగా వేడుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -