తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ షో’. బై 7పీఎమ్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ చుట్టూ ఓ ప్రేమ కథ, ఓ వింత సమస్య, దాన్నుంచి జెనరేట్ అయ్యే కామెడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఓ క్యాచీ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
సనారే సాహిత్యం అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా ఉంది. ఇక యశ్వంత్ నాగ్, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. సురేష్ బొబ్బిలి బాణీ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలో హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మేకర్లు.. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. మాస్టర్ రోహన్ నటిస్తున్న ఈ చిత్రానికి రచయిత- దర్శకుడు: రాహుల్ శ్రీనివాస్, సంగీతం : సురేష్ బొబ్బిలి, డీఓపీ : సోమ శేఖర్, ఎడిటర్ : నరేష్ అడుప, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రజ్ఞయ్ కొణిగారి, ప్రొడక్షన్ డిజైనర్ : ఫణి తేజ మూసి.
‘వయ్యారి వయ్యారి..’
- Advertisement -
- Advertisement -