Wednesday, October 1, 2025
E-PAPER
Homeసినిమాశ్రీమురళి 'పరాక్‌' మొదలైంది

శ్రీమురళి ‘పరాక్‌’ మొదలైంది

- Advertisement -

‘బగీరా’ విజయం తర్వాత హీరో శ్రీమురళి నటించబోయే చిత్రం ‘పరాక్‌’. ఈ చిత్ర ముహూర్త వేడుక మంగళవారం బెంగళూరులోని బండి మహాకాళి ఆలయంలో జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు క్లాప్‌ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులతో మాట్లాడుతూ, ”పరాక్‌’ ఒక వింటేజ్‌ స్టైల్‌ సినిమా. నా నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ కథ ఎంచుకోవడానికి దాదాపు 200 స్క్రిప్ట్‌లను విన్నాను. నేను గత రెండు సంవత్సరాలుగా ‘పరాక్‌’ టీంతో ప్రయాణించాను. ఈ నెల నుండి షూటింగ్‌ ప్రారంభమవుతుంది. చరణ్‌ రాజ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు’ అని తెలిపారు. ఈ చిత్రానికి హలేష్‌ కోగుండి దర్శకత్వం వహిస్తారు. కొన్ని షార్ట్‌ ఫిలిమ్స్‌కి పనిచేసిన తర్వాత ఆయన ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని బ్రాండ్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం : చరణ్‌ రాజ్‌, సినిమాటోగ్రాఫర్‌ : సందీప్‌ వల్లూరి, ఆర్ట్‌ డైరెక్టర్‌ : ఉల్లాస్‌ హైదూర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -