దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రిలీజైన తొలి చిత్రం ‘హనుమాన్’ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ యూనివర్స్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా ‘మహాకాళి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్‌కెడి స్టూడియోస్ బ్యానర్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించగా, ఆర్‌కె దుగ్గల్ సమర్పిస్తున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షోరన్నర్‌గా వ్యవహరిస్తుండగా, పూజ అపర్ణ కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ‘ఛావా’లో ఔరంగజేబు పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఆయనకి తెలుగులో తొలి చిత్రం. ‘ఛావా’ విజయం తర్వాత ఆఫర్లు వెల్లువెత్తినప్పటికీ, కథాబలం, ఆయన పాత్ర డెప్త్ తదితర విషయాలు నచ్చి ఆయన తన తెలుగు రిలీజ్ కోసం ఈ ప్రాజెక్ట్‌ని ఎంచుకున్నారు. అక్షయ్ పాత్రను పరిచయం చేస్తూ, సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్‌ని మేకర్స్ మంగళవారం రిలీజ్ చేశారు.
హిందూ పురాణాలలో అసురుల గురువు శుక్రాచార్యుడుగా ఒక భారీ పర్వత కోట ముందు నిలబడి ఉన్నట్లు ప్రజెంట్ చేసిన లుక్ అందర్నీ అలరిస్తోంది. తపోవ్రత వస్త్రాలు, చీకటినీ చీల్చే కాంతివంతమైన కళ్ళతో శుక్రాచార్యుడి రూపం అద్భుతంగా దర్శనమిస్తుంది. దేవతలు, దానవులూ ఇద్దరి భవితవ్యాన్ని మలిచిన మహర్షిగా, ఆయన ఈ చిత్రంలో అద్భుతమైన పాత్ర చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం షూట్ పూర్తి కాగా, డిసెంబర్ నాటికి మొత్తం ప్రొడక్షన్ పూర్తి చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒకేసారి కొనసాగుతున్నాయి. విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేస్తారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, డీఓపీ : సురేష్ రగతు, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎడిటర్: సాయిబాబు తలారి.
అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా
- Advertisement -
- Advertisement -