Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసిమెంట్‌ మాటున గంజాయి సరఫరా

సిమెంట్‌ మాటున గంజాయి సరఫరా

- Advertisement -

ఒడిశా టూ రాజస్థాన్‌ వయా హైదరాబాద్‌
రూ.6 కోట్ల విలువైన 1210 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు
ఇంత పెద్ద మొత్తంలో గంజాయి లభ్యం మొదటిసారి: రాచకొండ సీపీ సుధీర్‌బాబు


నవతెలంగాణ -హయత్‌ నగర్‌
ఒడిశా నుంచి హైదరాబాద్‌ గుండా రాజస్థాన్‌కు తరలిస్తున్న రూ.6 కోట్ల విలువ చేసే 1210 కిలోల గంజాయిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుపడడం ఇదే మొదటిసారి అని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ సుధీర్‌బాబు తెలిపారు. ఎల్‌బీనగర్‌లో ఉన్న సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌ జోద్‌పూర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ విక్రమ్‌ విష్ణోయి అలియాస్‌ వికాస్‌.. వాహన యజమాని రాంలాల్‌ ఆదేశం మేరకు గంజాయిని ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తున్నాడు.

అక్కడ డెవిలాల్‌ అలియాస్‌ కట్టు, అయూబ్‌ఖాన్‌ డ్రగ్స్‌ రిసీవర్‌లుగా ఉన్నారు. డ్రైవర్‌ ఖమ్మం మార్గమధ్యలో ఆగి సిమెంట్‌ బస్తాల కింద గంజాయిని పెట్టి హైదరాబాద్‌ మీదుగా రాజస్థాన్‌కు బయల్దేరాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు సంయుక్తంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని కొత్తగూడెం గ్రామం వద్ద లారీని పట్టుకున్నారు. గంజాయి, లారీ, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ షాకీర్‌ హుస్సేన్‌, ఎస్‌ఓటీ ఏసీపీ సత్తయ్య, ఇన్‌స్పెక్టర్లు అశోక్‌రెడ్డి, రవికుమార్‌, ఎస్‌ఐ రాజు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -