నవతెలంగాణ-నాగార్జునసాగర్
కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద వస్తోంది. అక్కడి నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి మంగళవారం సాయంత్రం 5,81,628 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంలో బయటకు విడుదల చేస్తున్నారు. సాగర్ డ్యామ్ 26 క్రస్ట్‌గేట్లలో 24గేట్లు 15 అడుగులు, రెండు గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువనకు 5,31,534 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 9533 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 6556 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32,805 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1200 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 584.10 అడుగుల నీటిమట్టం ఉంది.
సాగర్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES