హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
బాపు ఘాట్, మ్యూజియం హాల్ పరిశీలన
బయోమెట్రిక్ హాజరు విధానం ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గాంధీ జయంతి నేపథ్యంలో చేపట్టిన పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బాపు ఘాట్‌లోని పలు ప్రాంతాలను మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం బాపూ మ్యూజియం హాల్‌లో ఏర్పాట్లపై చేపట్టిన సమావేశంలో అదనపు కలెక్టర్ జి.ముకుంద రెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా కేటాయించిన పనులను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. అంతకుముందు బాపు ఘాట్‌ను సందర్శించి పనుల పురోగతిపై అధికా రులకు దిశా నిర్దేశం చేశారు.
ఈనెల 2న గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు బాపు ఘాట్, మ్యూజియంను సందర్శించనున్నందున ఏర్పాట్లల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ ఉత్పన్నం కాకుండా చూడాలని అధికా రులను ఆదేశించారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ, విద్యాశాఖ, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, సమాచార శాఖ, ఉద్యానవన శాఖ, ఫైర్, పోలీస్, పర్యాటకశాఖ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై ఆమె సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామకృ ష్ణారావు, డీఎంఅం డ్‌హెచ్‌వో డాక్టర్ వెంకటి, డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ అహల్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బయోమెట్రిక్ హాజరు విధానం ప్రారంభం
జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పక పాటించాలని కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ రెండో అంతస్తులోని జిల్లా సర్వే అండ్ ల్యాండ్ కార్యాల యంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అదనపు కలెక్టర్లు ముకుంద రెడ్డి, కదిరవన్ పలనితో కలిసి ప్రారంభించారు. బయోమెట్రిక్ హాజరు ద్వారా సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆలస్యం చేస్తే హాజరులో వ్యత్యాసాలు వస్తాయని అన్నారు. సమయానికి కార్యాలయానికి రావాలని, లేని యేడల బయోమెట్రిక్ మిషన్‌లో గైర్హాజరుగా నమో దవుతుందన్నారు. ఈ విధానాన్ని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడూ పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఈ.వెం కటాచారి, జిల్లా సర్వే అధికారి వి.శ్రీరామ్, జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ మహేందర్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఎం.వెంకటేష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.