Wednesday, October 1, 2025
E-PAPER
Homeజిల్లాలుస్థానిక ఎన్నికల పోటీకి అర్హులు వీరే.!

స్థానిక ఎన్నికల పోటీకి అర్హులు వీరే.!

- Advertisement -

  • నామినేషన్ పరిశీలన నాటికి 21 సంవత్సరాలుండాలి
  • మండల ఇంచార్జి ఎంపీడీఓ శ్రీరామూర్తితో నవతెలంగాణ ముఖాముఖి

నవతెలంగాణ-మల్హర్ రావు.

స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, వార్డు సభ్యులు) ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులకు ఎదురయ్యే సందేహా లపై బుధవారం మండల ఇంచార్జి ఎంపీడీఓ శ్రీరామూర్తి నవ తెలంగాణ ముఖాముఖిలో సమాధానాలతో నివృత్తి చేశారు.

ఎంపిడిఓ: లేదు. తెలంగాణ పంచాయతీ రాజ్ నియమావళి ప్రకారం సంబంధిత ఓటరు లిస్టులో తప్ప నిసరిగా ఓటరుగా నమోదై ఉండాలి.

ఎంపిడిఓ: పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే అనర్హులే. 1995 మే 31 ముందు ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే అర్హులు. 1995 జూన్ 1 తర్వాత పుట్టిన వారితో కలిపి ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అనర్హులవుతారు.

ఎంపిడిఓ: ఉమ్మడి రాష్ట్రంలోని హైకోర్టు తీర్పు ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలు స్వంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగానే ముగ్గురు సంతా దత్తత ఇచ్చినా పోటీకి అనర్హులే.వారికి ముగ్గురు సంతానం పరిగణించబడతారు.

ఎంపిడిఓ: అప్పుడు భార్యలు పోటీకి అర్హులు అవుతారు, భర్తకు అవకాశం ఉండదు.

ఎంపిడిఓ: నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే సమయానికి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉండి, పోటీ చేసే వ్యక్తి భార్యగాని, పోటీ చేసే మహిళనే మళ్లీ గర్భవతిగా ఉన్నా పోటీకి అర్హులే అవుతారు.నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత బిడ్డకు జన్మనిచ్చినా పోటీకి అర్హులే అవుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -