నవతెలంగాణ–కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కోమనపల్లి శ్రీవల్లిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. సావిత్రీబాయి ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మలేషియాలో ఈనెల 28న
నిర్వహించిన బతుకమ్మ, దసరా సంబరాలలో శాస్త్రీయ నృత్య పోటీల్లో కోమనపల్లి శ్రీవల్లి ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
మలేషియాలో కూచిపూడి, ఆంధ్ర నాట్యంలో ప్రతిభ కనబరిచిన కోమనపల్లి శ్రీవల్లిని వేల్పూర్ లోని తన స్వగృహంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా శాస్త్రియ నృత్యంలో ఇంకా ఎత్తుకు ఎదగాలని, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేలా కృషి చేయాలనీ ఎమ్మెల్యే అకాక్షించారు. కార్యక్రమంలో శ్రీవల్లి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.