నవతెలంగాణ-హైదరాబాద్: పాక్-భారత్ ఉద్రిక్తతల వేళ మరో సంచలన నిర్ణయం తీసుకుంది భారత్ ప్రభుత్వం. భవిష్యత్‌లో జరిగే ఎటువంటి ఉగ్రదాడినైన.. యుద్ధ దాడిగానే పరిగణించాలని భావించింది. ఆ తరహా దాడులను ఎదురుకోవడానికి సంసిద్ధంగా ఉండాలని పేర్కొంది. పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు నేపథ్యంలో … శనివారం మరోసారి త్రివిద దళాల అధిపతులతో ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్, ఎన్‌ఎస్‌ఏ దోవల్ హాజరయ్యారు. సరిహద్దు లో నెలకొన్న తాజా పరిస్థితి, పాక్ విషయంలో చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు త్రివిధ దళాల మాజీ అధిపతులు, ఆర్మీ, నేవీ, వాయుసేన టాప్ రిటైర్డ్ ఆఫీసర్లతోనూ మోడి భేటీ అయ్యారు. సైన్యంలో వారికి ఉన్న అపార అనుభవం ఆధారంగా తాజా పరిస్థితిని ఎదుర్కోవడంపై వారి సూచనలు, సలహాలను ప్రధాని తీసుకున్నారు.
భారత్-పాక్ ఉద్రిక్తతలు..భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES