Wednesday, October 1, 2025
E-PAPER
Homeజిల్లాలుదివ్యాంగుల హామీలు అస్తమయం

దివ్యాంగుల హామీలు అస్తమయం

- Advertisement -

– విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

నవతెలంగాణ – కామారెడ్డి

దివ్యాంగులకు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అస్తమయం అయ్యాయని విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం నిరంతరం ఎన్ని సంఘాలు పోరాటాలు చేసిన ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం తగదన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఎన్నికల కురుక్షేత్రంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నేడు పంచాయతీ ఎన్నికల్లో ముందుకు రావడం మాతో పాటు యావత్ తెలంగాణ వ్యవస్థనే మోసాగించే కుట్రకు నిదర్శనం అన్నారు.

హస్తం ప్రభుత్వం ఆదర్శం….కాదు

హస్తం పార్టీ మెనిఫెస్టోలో దివ్యాంగుల పెన్షన్ 6000/- దివ్యాంగుల ఉచిత రావాణా సౌకర్యం, పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్, బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ, దివ్యాంగుల చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయడం, ప్రతి సంక్షేమ పథకాల్లో అవకాశం అంటూ మాతో ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదంటే మేమంటే ఇంత చులకనగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును ఎండగడుతాం అన్నారు. దసరా కానుకగా ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తాం. కొత్త ప్రభుత్వం కొత్త పెన్షన్ అనే ముఖ్యమంత్రి గారి మాట నినాదాలుగా గుర్తు చేస్తాం. పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగుల రిజర్వేషన్ కోసం న్యాయాస్థానం దృష్టికి తీసుకేల్తాం అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -