- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు:
జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఒక కొత్త చర్చ మొదలైంది. సర్పంచ్ కావాలనుకునే నాయకులు ఇప్పుడు అభివృద్ధి పనుల కంటే ‘కోతుల బాధ’పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పంట పొలాలు, ఇళ్లు, పల్లెలు, గల్లీల్లో విస్తారంగా తిరుగుతున్న కోతుల గుంపులు రైతులకు, గ్రామస్థులకు తలనొప్పిగా మారాయి. ఇంటింటా తిండి పదార్థాలు దోచుకోవడం, పంటలు నాశనం చేయడం, చిన్నపిల్లలను వెంబడించడం వంటివి గ్రామాల రోజువారీ సమస్యలుగా మారాయి.ఈ నేపథ్యంలో సర్పంచ్ గా గెలవాలంటే కోతుల బెడద లేకుండా చూస్తామని మొదలు ఓటర్లకు మాట ఇస్తేనే ఓట్లు వేస్తామనే చర్చ జోరుగా సాగుతోంది.
- Advertisement -