నవతెలంగాణ-ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామంలో శుక్రవారం మూడోవ తేదీన దసరా అలాయ్, బలాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కుంట గంగారెడ్డి, త్రివేణి అగ్రిటెక్ యజమాని సల్ల నర్సారెడ్డి లు బుధవారం తెలిపారు. అంకాపూర్ గ్రామ విశిష్టత ,గొప్పతనాలు, సోదర భావం, ప్రేమభిమానం ప్రపంచ ఖ్యాతిగాంచేలా కలసిమెలసి స్వచ్ఛందంగా నిర్వహించే సామూహిక కార్యక్రమం అని అన్నారు. గ్రామం నుండి అమెరికా దాకా పేరు నిలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపే ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గ్రామంలోని లచ్చ గౌడ్ కళ్యాణమండపం వద్ద ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో విద్యావంతులకు, మేధావులకు, రాజకీయ ప్రముఖులకు సన్మానంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
అంకాపూర్ లో దసరా అలాయ్ బలాయ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES