Thursday, October 2, 2025
E-PAPER
Homeమహబూబ్ నగర్యూరియా అధిక ధరలకు విక్రయాలపై ఫిర్యాదు

యూరియా అధిక ధరలకు విక్రయాలపై ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ అచ్చంపేట : పట్టణంలోని అయ్యప్ప ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణంలో యూరియాను అధిక ధరలకు అమ్ముతున్నారని మండల పరిధిలోని చందాపూర్ గ్రామానికి చెందిన సాయిబాబు వ్యవసాయ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాను గ్రామంలో మూడు ఎకరాలలో వరి పంట సాగు చేశారని అందుకు యూరియా అవసరం ఉండగా పైన తెలిపిన షాపులు ఆశ్రయించారని తెలిపారు.ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధర ఒక బస్తా యూరియా రూ.270/- ఉండగా   సంబంధిత షాప్ డీలర్లు బ్లాక్ మార్కెట్ చేసి యూరియా బస్తాను రైతులకు రూ.350/-కి విక్రయిస్తున్నారు. నేను కూడా ఒక   బస్తాకి రూ.350/-చొప్పున రెండు బస్తాలకు రూ.700  ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతున్న డీలర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని,రైతులకు ప్రభుత్వ నిర్ణయించిన ధర (ఎంఆర్పీ)కే ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -