Thursday, October 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలి

ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలి

- Advertisement -

– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ 

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిబ్బంది ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజా శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సంస్థల్లో పాలుపంచుకునే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను, సౌకర్యాలను ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులు పరిశీలన చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
పోలింగ్ కేంద్రాల నంబర్లు, దివ్యాంగ ఓటర్లకు అణువుగా ఉండేలా ర్యాంపులు, పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తదితర విషయాలపై పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే త్వరగా వాటి పనులు పూర్తి చేసి, ఎన్నికల నిర్వహణకు కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -