కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ లో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్
నవతెలంగాణ కంఠేశ్వర్
ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది అని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వసలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి 95 మంది లబ్ధిదారులకు క 95 లక్షల 11,020 రూపాయలను పంపిణీ చేస్తున్నాం అన్నారు.అలాగే షాదీ ముబారక్ 349 లబ్ధిదారులకు 3 కోట్ల 49 లక్షల 40వేల 484 రూపాయలు అందించమన్నారు.
మొత్తం లబ్ధిదారులకు 4 కోట్ల 44 లక్షల 51504 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులలో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు . 500 కు సిలిండర్ 200 యూనిట్ల విద్యుత్ ఉచితం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇంద్రమ్మ ఇల్లు రైతు రుణమాఫీ రైతు భరోసా యువతకు ఉద్యోగాలు సన్న బియ్యం పథకాలు అమలు పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్, నుడా చైర్మన్ కేశ వేణు, గ్రంధాలయ చైర్మన్ రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.