నవతెలంగాణ – మల్హర్ రావు: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అపత్కాలంలో గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకుని నిండు ప్రాణాన్ని కాపాడారు. బుధవారం రాత్రి సుమారు 9 గంటలకు మంత్రి శ్రీధర్ బాబు గారు మంథని నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు పాల్గొని ముగించుకుని కరీంనగర్‌కు తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో పెద్దపల్లి శివారుల్లో ఓ ద్విచక్రవాహనదారుడు తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురై, గాయాలతో పడి ఉండడాన్ని గమనించి వెంటనే స్పందించారు. వాహనాన్ని సమకూర్చి గాయపడిన వ్యక్తిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులతో మాట్లాడి, క్షతగాత్రుడికి సకాలంలో అత్యవసర వైద్యం అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES