‘మాస్ జాతర’ రిలీజ్‌కి సంబంధించి రవితేజ అభిమానులకు, ప్రేక్షకులకు దసరా సందర్భంగా ఓ సర్‌ప్రైజ్ అప్‌డేట్‌ను మేకర్స్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వింటేజ్ వైబ్స్, పక్కా కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం థియేటర్లలో అసలుసిసలైన మాస్ పండుగను తీసుకురాబోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, వినోదాల విందుకి హామీ ఇచ్చింది. కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా రవితేజ, హైపర్ ఆదిలపై చిత్రీకరించిన ఒక సరదా వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియోలో హైపర్ ఆది 2025 సంక్రాంతి, వేసవి సెలవులు, వినాయక చవితి అంటూ పలుసార్లు సినిమా వాయిదా పడటాన్ని సరదాగా ఎగతాళి చేయగా.. ఆలస్యానికి గల కారణాలపై రవితేజ అంతే చమత్కారంగా స్పందించారు.
మాస్ మహారాజా రవితేజ అంటేనే సందడి. ఒకప్పటి మాస్ మహారాజాను గుర్తుచేస్తూ.. సినిమా తాలూకా ఆహ్లాదకరమైన, వినోదాత్మక శైలిని చూపిస్తూ ఈ వీడియో ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈచిత్రానికి దర్శకత్వం: భాను బోగవరపు, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: విధు అయ్యన్న, మాటలు: నందు సవిరిగాన, కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ. సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.
‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -