Thursday, October 2, 2025
E-PAPER
Homeఆటలుపోచంపల్లి నేతన్నలచే హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జెర్సీ

పోచంపల్లి నేతన్నలచే హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జెర్సీ

- Advertisement -

హైదరాబాద్‌: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ సీజన-4లో బరిలోకి దిగుతున్న హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ (హెచ్‌బీహెచ్‌) జట్టు తన కొత్త జెర్సీని ఆవిష్కరించింది. బుధవారం హెచ్‌బీహెచ్‌ జట్టు యజమాని కంకణాల అభిషేక్‌, ఆ టీమ్‌ కెప్టెన్‌ పాలో యూరీ లామోనియర్‌ జెర్సీని ఆవిష్కరించారు. తెలంగాణ సంప్రదాయానికి ప్రాధాన్యత ఇస్తూ పోచంపల్లి చేనేత వస్త్రకారులు తయారు చేసే ఇక్కత్‌ ఫ్యాబ్రిక్‌ ప్రేరణతో మన సంస్కతి ప్రతిబింబించేలా హైదరాబాద్‌ జట్టు జెర్సీను తయారు చేయడం విశేషం. గురువారం నుంచి మొదలవుతున్న ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో పోటీ పడుతున్న హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టుకు రెండు తెలుగు రాష్టాల్ల్రోని వాలీబాల్‌ అభిమానులు తమ మద్దతు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -