Thursday, October 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమాపై నిఘా దారుణం

మాపై నిఘా దారుణం

- Advertisement -

పర్యావరణ ఉద్యమకారుడు వాంగ్‌చుక్‌ను విడుదల చేయాలి : రాష్ట్రపతికి ఆయన సతీమణి లేఖ

లేహ్‌ : పర్యావరణవేత్త్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేసి ఐదు రోజులైంది. ఈ విషయంపై ఆయన భార్య పర్యావరణ కార్యకర్త గీతాంజలి ఆంగ్మో వాంగ్‌చుక్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్స్‌, లడఖ్‌ (హెచ్‌ఏఐఎల్‌) వ్యవస్థాపకురాలు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఆంగ్మో రాష్ట్రపతికి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. వాంగ్‌చుక్‌ను ”కారణం లేకుండా” నిర్బంధిం చారని, తన భర్తతో ఫోన్‌లో లేదా వ్యక్తిగతంగా మాట్లాడటానికి ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. ”నా భర్తను అక్రమంగా నిర్బంధించడమే కాకుండా, రాష్ట్రంతో పాటు దర్యాప్తుసంస్థలూ మమ్మల్ని వేధిస్తున్నాయి. తమపై నిఘా ఉంచిన విధానం చాలా దారుణం. ఈ చర్య భారత రాజ్యాంగ స్ఫూర్తి, నైతికతను ఉల్లంఘిస్తోంది.

ఇందులో ప్రతి పౌరుడికీ చట్టపరమైన ప్రాతినిధ్యానికి ప్రాథమిక హక్కును హామీ ఇచ్చే ఆర్టికల్‌ 21, 22 ఉన్నాయి” అని ఆంగ్మో ప్రాతినిధ్య పత్రంలో పేర్కొన్నారు.సెప్టెంబర్‌ 30న, ఇనిస్టిట్యూట్‌ సెక్యూరిటీ గార్డుకు ఎఫ్‌ఐఆర్‌ ఉన్న ఒక కమ్యూనికేషన్‌ అందిందని, ”లడఖ్‌ హిల్స్‌ లోని ఫెలోషిప్‌ విద్యార్థులు, రెసిడెన్షియల్‌ సిబ్బంది, హెచ్‌ఏఐఎల్‌ ఇనిస్టిట్యూట్‌, ఫియాంగ్‌లో నివసిస్తున్న టీచర్స్‌ ట్రైనీల వివరాలు” , వారి పేరు, తల్లి దండ్రులు, నివాసం, తాజా ఛాయా చిత్రాలతో పాటు సంస్థలో సంప్రదింపు నంబర్లు ఇవ్వాలంటూ కోరుతున్నారని ఆమె తెలిపారు. వాంగ్‌చుక్‌పై ”అణచివేసే వేట” జరుగుతోందని ఆంగ్మో ఆ లేఖలో పేర్కొన్నారు. ”ఈ దేశ ప్రజలు సంఘీభావం, మద్దతుతో ముందుకు వస్తున్నారు. దేశానికి సేవ చేసిన నిష్కళంకమైన ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన శాంతియుత నిరసనకారుడిపై ప్రభుత్వం తీసుకున్న చర్య చూసి ‘షాక్‌’ అయ్యారు” అని ఆమె లేఖలో వివరించారు.

భారత సైన్యానికి సమర్థవంతమైన ఆశ్రయాలను నిర్మించడంలో, లడఖ్‌ ప్రజల ”జాతీయవాదం”లో తన భర్త సహకారాన్ని నొక్కి చెబుతూ.. ఆంగ్మో ”లడఖ్‌ నేల పుత్రుడిపై ఇంత దారుణంగా ప్రవర్తించడం పాపం మాత్రమే కాదు, సంఘీభావం , శాంతియుత సహజీవనంతో బలమైన సరిహద్దులను నిర్మించడంలో వ్యూహాత్మక లోపముంది” అని అన్నారు.తన భర్త ”ఎల్లప్పుడూ భారతదేశం యొక్క సంఘీ భావం, మన సరిహద్దులను బలోపేతం చేయడం , బలమైన ప్రజాస్వామ్య యంత్రాం గం ద్వారా – చట్టం 6వ షెడ్యూల్‌తో రాష్ట్ర హౌదా/యూటీ ద్వారా దాని పరిధీయ ప్రాంతాల ఏకీకరణ కోసం నిలబడతారు” అని ఆమె అన్నారు.వాంగ్‌చుక్‌ను ”బేష రతుగా విడుదల” చేయాలని అధ్యక్షుడిని కోరుతూ, ”ఎవరికీ ఎప్పుడూ ముప్పు కలిగించని వ్యక్తి, బేషరతుగా ఆయన్ను విడిచిపెట్టండి” అని కోరారు. ప్రధానమంత్రి కార్యాలయం, హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ , లడఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయానికి కూడా రాష్ట్రపతికి పంపిన లేఖ కాపీలను ఆమె పంపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -