Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్లూపస్ దినోత్సవ సందర్భంగా టుకే రన్ ..

లూపస్ దినోత్సవ సందర్భంగా టుకే రన్ ..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్, నిజామాబాద్ రుమటాలజీ అండ్ అర్గనైటిస్ సెంటర్ వారి సంయుక్త ఆద్వర్యంలో ప్రపంచ లూపస్ దినోత్సవాన్రి పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించడానికి శనివారం ఉదయం 7గంటల 30 నిమి. నుండి 8 గంటల 30నిమిషాల వరకు హానమన్ జంక్షన్ వినాయక నగర్ నుండి రుమటాలజీ అండ్ అర్గనైటిస్ సెంటర్ వరకు ఐఎంఏ వైద్యులు ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎండీ (ఇంటర్నల్ మెడిసిన్) డీఎం, (రుమటాలజీ) గోల్డ్ మెడలిస్ట్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఇమ్యునాలజిస్ట్, అలెర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ గ్రీష్మ మాట్లాడుతూ.. ఇది శరీరంలోని కళ్లు, మెదడు, ఊపిరితిత్తులు,మూత్రపిండాలు, రక్త నాశాలు ఏ భాగాన్ని అయినా లూపస్ వ్యాధి ప్రభావితం చేస్తుందని, ఈ వ్యాది శరీరంలో చర్మం దగ్గర నుంచి గుండె వరకు అన్ని ఇవయవాలపైన దాడి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఐఎంఏ అధ్యక్షలు డా అజ్జ శ్రీనివాస్, కోశాధికారి డా. రాజేందర్ సూరినీడు లు మాట్లాడుతూ..వ్యాధి సోకిన వారిలో జుట్టు ఎక్కువగా విడిపోతూ ఉంటుందని, ఎండలోకి వెళ్లినప్పును వేడికి చెంపలపైన దద్దుర్లు, ఎలాంటి కారణం లేకుడా జ్వరం వచ్చిపోతూ, కీళ్ల నొప్పులు తలనొప్పులు రావడం జరుగుతుందని అన్నారు. వ్యాధి నివారణకు రుమటాలజిస్టు వైద్యులను సంప్రదించి వ్యాధి తీవ్రతను బట్టి వారు సూచించిన మందులు వాడాలన్నారు. అనంతరం ఎంబిబిఎస్, ఎండి (జనరల్ మెడిసిన్), డీఎం (కార్డియాలజీ) సారాంశం ఎంఆర్సిపి (ఎండోక్రినాలజీ), పిడిఎఫ్ (ఫీటల్ కార్డియాలజీ) డాక్టర్ జి రవి కిరణ్ మాట్లాడుతూ..ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, మంచి నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా వంటి ప్రక్రియలతో ఒత్తిడి తగ్గించుకోవడం వంటి మంచి జీవనశైలిని అలవరచుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యవరంగానికి, ఇబ్బందికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐఎంఎ అధ్యక్షలు డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డా. జీవన్ రావు , శ్రీశైలం సీనియర్ వైద్యలుడా. పిబి. కృష్ణామూర్తి, డా. దామోదర్ రావు, డా. ద్వారకానాథ్, డా. రవికిరణ్, డా. గాంధీ, డా. రాజేందర్ సూరినీడు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -