నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలో అత్యంత విశ్వసనీయంగా ఎన్నో బహుమతులు అందుకున్న సదరన్ ట్రావెల్స్ గ్లోబల్ టూరిజం అవార్డు- 2025లో బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ పురస్కారాన్ని అందుకుంది. వరుసగా రెండోసారి ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకోవడం గమనార్హం. పర్యాటక, హాస్పిటాలిటీ రంగాల్లో అత్యున్నత, ఆధునీకతకు గౌరవం తెలిపేలా అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టూరిజం అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ వేడుక నోయిడాలోని ఫిల్మ్ సిటీలో ఘనంగా బుధవారం నిర్వహించారు. ఈ అవార్డుల ఎంపికను టూరిజం, హాస్పిటాలిటీ, విమానయాన రంగాలకు చెందిన నాయకులు, దూరదృష్టి ఉన్న సభ్యులు జ్యూరీ ప్యానెల్‌లో ఉంటారు. ఈ అవార్డును ఎస్‌టీఐసీ ట్రావెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మెన్ సుభాష్ గోయల్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ అధ్యక్షుడు రవి గోసిన్ సదరన్ ట్రావెల్స్‌కు ప్రదానం చేశారు. సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి మాట్లాడుతూ తాము రెండోసారి గ్లోబల్ టూరిజం అవార్డును అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. తమ కస్టమర్ల విశ్వాసం, సిబ్బంది అంకితభావంతో చేసిన కృషికి ఇది గుర్తింపు అని చెప్పారు. ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మాత్రమే కాకుండా స్ఫూర్తిదాయకంగా, మరుపురాని అనుభూతిగా చేయడమే తమ లక్ష్యమని వివరించారు.
సదరన్ ట్రావెల్స్‌కు రెండోసారి గ్లోబల్ టూరిజం అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES