Thursday, October 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరైతులకు అండగా రైతు కమిషన్‌

రైతులకు అండగా రైతు కమిషన్‌

- Advertisement -

– ఏడాది కాలంలో అనేక మార్పులకు శ్రీకారం
– కమిషన్‌ సూచనలకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ఏర్పడ్డ రైతు కమిషన్‌ ఏడాది కాలంలో వారికి నిత్యం అండగా నిలిచింది. దళారులు, కమిషన్‌ ఏజెంట్ల భారి నుంచి రైతులను రక్షించేందుకుకృషి చేస్తున్నది. విత్తనోత్పత్తి రైతులకు విత్తన కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించడంలో రైతు కమిషన్‌ కీలక పాత్ర పోషించింది. రికార్డు స్థాయిలో ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులకు దాదాపు రూ.4 కోట్లను నష్టపరిహారంగా సీడ్‌ కంపెనీల నుండి వచ్చేలా చేసింది. గద్వాల్‌లో పత్తి, సూర్యాపేటలోవరి, ఖమ్మంలో మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులకు సైతం నష్టపరిహారం అందేలా కమిషన్‌ కృషి చేసింది. అలాగే గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రయివేట్‌ అప్పులు చేసి అసలు, వడ్డీ కట్టలేక చిన్న, సన్నకారు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసు కున్న సంఘటనలు చాలానే వున్నాయి. మనీ లెండింగ్‌ యాక్ట్‌ పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వానికి రైతు కమిషన్‌ సూచన చేసింది. ఈ యాక్ట్‌ అమలు చేస్తేనే రాష్ట్రంలో రైతాంగానికి రక్షణ ఉంటుందని వివరిం చింది. రాష్ట్రంలో చెరువులను కొందరు వెంచర్లు వేసి అడ్డగోలుగా దండు కుంటున్నారు. వాటి పరిరక్షణ బాధ్యతను గత ప్రభుత్వం సరిగ్గా చేపట్టలేదు. గ్రామాల్లో వున్న చెరువుల రక్షణ, భూ గర్బజలాలు కాపాడాలన్నా నీటి సంఘాలు అవసరమని స్పష్టం చేసింది. దసరా తర్వాత నీటి సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. ఇందుకు కావాల్సిన కసరత్తు సరుగుతున్నది. విత్తన చట్టం వస్తేనే నకిలీని అరికట్టవచ్చని చెప్పడంతో ప్రభుత్వం విత్తన చట్టం ముసాయిదా రూపొందించడానికి కమిటీ వేసింది. ఆ కమిటీ చేస్తున్న విత్తన చట్టం ముసాయిదా తుది దశలో వుంది. పోడు పట్టాలున్న రైతులకు పంట రుణాలు ఇచ్చేలా కమిషన్‌ సూచన చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతులకు పోడు పట్టాలున్నాయి. కానీ వివిధ కారణాల వల్ల గిరిజన రైతులు పంట రుణాలు పొందలేకపోతున్నారు. బ్యాంకర్లు సైతం పంటరుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ, బ్యాంకర్లు, ఫారెస్ట్‌ అధికారులు, గిరిజన రైతులతో కమిషన్‌ సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని పోడు పట్టాలు న్న గిరిజన రైతులకు పంటరుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. దసరా తర్వాత ఇది అమల్లోకి రానుంది. అలాగే ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి తీసుకురావాలని కమిషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు మరికొన్ని అంశాలపై కూడా రైతు కమిషన్‌ ప్రభుత్వానికి సూచనలు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -