– చైనా 76వ వార్షికోత్సవ వేడుకల్లో జిన్‌పింగ్ పిలుపు
బీజింగ్ : పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం బీజింగ్‌లోని తియాన్మిన్ స్క్వేర్ వద్ద పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. జాతీయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి జిన్‌పింగ్ మాట్లాడుతూ, శ్రద్ధాసక్తులతో పనిచేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా ఆధునీకరణను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కృత నిశ్చయంతో, ధృఢంగా ముందుకు సాగాలని కోరారు. శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా మార్పులనేవి ప్రపంచంలో అత్యంత వేగంగా చోటు చేసుకుంటున్నాయని, అందువల్ల మనం మానవత్వం విలువలను మరింత ముమ్మరంగా ముందుకు తీసుకెళ్ళాలని, నిజమైన బహుళపక్షవాదాన్ని ఆచరించాలని జిన్‌పింగ్ కోరారు. అంతర్జాతీయ అభివృద్ధి చొరవలను, అంతర్జాతీయ భద్రతా చొరవలను మనం కొనసాగించాలని, ఇతర దేశాలతో కలిసి మానవాళికి ఉమ్మడి భవిష్యత్తుతో కూడిన భవితవ్యాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపిచ్చారు. తైవాన్ అంశాన్ని కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. చైనా ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకోవడంలో విదేశీ జోక్యాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
మానవత్వపు విలువలను పరిరక్షించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES