Thursday, October 2, 2025
E-PAPER
Homeజాతీయందేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలు

దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలు

- Advertisement -

– 6.3 శాతం మంది రైతులు, వ్యవసాయ కార్మికులు బలవన్మరణం
– ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు వెల్లడి
న్యూఢిల్లీ :
దేశంలో ఆత్మహత్యలు గత ఐదేండ్లుగా ఏడాది ఏడాది పెరుగుతున్నాయి. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)- 2023 ఏడాది సంబంధించిన రిపోర్టును విడుదల చేసింది. ఆ రిపోర్టు ప్రకారం దేశంలో 1,71,418 మంది వివిధ వర్గాలకు చెందిన వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 10786 (6.3 శాతం) మంది వ్యవసాయ సంబంధిత బలవన్మరణాలు జరిగాయి. అందులో 4,690 మంది రైతులు, 6,096 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరుద్యోగులు 14,234 (8.3 శాతం) మంది ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థులు 13,892 (8.1 శాతం) మంది ఆత్మహత్య చేసుకున్నారు. 16,517 (9.6 శాతం) మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. పేదరికంతో 2,568 మంది, ప్రేమ విఫలం కావడంతో 16,024 మంది, కుటుంబ సమస్యలతో 1,09,306 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యలు
ఆంధ్రప్రదేశ్‌లో 8,684 (5.1 శాతం) ఆత్మహత్యలు జరిగాయి. రాష్ట్రంలో ఆత్మహత్యల రేటు 16.3 శాతంగా నమోదు అయింది. ఆరోగ్య సమస్యలతో 2,116 (24.4 శాతం), కుటుంబ సమస్యలతో 2,297, ప్రేమ విఫలంతో 214 మంది, పేదరికంతో 88 మంది, నిరుద్యోగంతో 83 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు 109 మంది, కౌలు రైతులు 92 మంది, వ్యవసాయ కార్మికులు 724 మంది ఉన్నారు.

తెలంగాణలో ఆత్మహత్యలు
తెలంగాణలో 10,580 (6.2 శాతం) ఆత్మహత్యలు జరిగాయి.రాష్ట్రంలో ఆత్మహత్యల రేటు 27.7 శాతం శాతంగా నమోదు అయింది. కుటుంబ సమస్యలతో 4,680 (44.2 శాతం), ప్రేమ విఫలంతో 231 మంది, పేదరికంతో 7 మంది, నిరుద్యోగంతో 10 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు 48 మంది, కౌలు రైతులు 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రమాదాల మరణాలు
ప్రమాదాల వల్ల సంభవించిన మరణాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 17,039 (3.8 శాతం), అందులో 14,175 మంది పురుషులు, 2,862 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌ జండర్స్‌ ఉన్నారు. తెలంగాణలో 13,375 (3.0 శాతం), అందులో 11,593 మంది పురుషులు, 1,780 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌ జండర్‌ ఉన్నారు. ప్రమాద మతుల రేటు ఆంధ్రప్రదేశ్‌లో 32.0 శాతం, తెలంగాణలో 35.1 శాతంగా ఉంది.

ట్రాఫిక్‌ ప్రమాదాల కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో 21,078 (3.8 శాతం), అందులో 14,175 మంది పురుషులు, 2,862 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌ జండర్స్‌ ఉన్నారు. తెలంగాణలో 23,673 (3.0 శాతం), అందులో 11,593 మంది పురుషులు, 1,780 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌ జండర్‌ కూడా ఉన్నారు. ట్రాఫిక్‌ ప్రమాదాల్లో మతులు ఆంధ్రప్రదేశ్‌లో 9,284, మంది, తెలంగాణలో 8,435 మంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాల కేసులు ఆంధ్రప్రదేశ్‌లో 19,949, తెలంగాణలో 22,903 కాగా రోడ్డు ప్రమాదాల మతులు ఆంధ్రప్రదేశ్‌లో 8,137, తెలంగాణలో 7,660గా నమోదయ్యాయి.

ఏడాది ఆత్మహత్యలు ఆత్మహత్యల రేటు
2019 1,39,123 10.4
2020 1,53,052 11.3
2021 1,64,033 12.0
2022 1,70,924 12.4
2023 1,71,418 12.3

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -