– రైెల్వే కమిటీ చైర్మెన్‌గా సీఎం రమేష్, హౌసింగ్, అర్బన్ వ్యవహారాలకు మాగుంట
న్యూఢిల్లీ : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు చోటు లభించింది. బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. కామర్స్ కమిటికి సానా సతీష్ (టీడీపీి), రేణుక చౌదరి (కాంగ్రెస్), అమ్రారామ్ (సీపీఐఎం) నియామకం అయ్యారు. హౌం వ్యవహారాల కమిటీకి కేశినేని శివనాథ్, టి.కష్ణప్రసాద్ (టీడీపీ), విద్య, మహిళా, శిశు, యువజన, క్రీడల కమిటీకి డి.పురందేశ్వరి (బీజేపీ), పరిశ్రమ కమిటీకి మల్లు రవి (కాంగ్రెస్), అరవింద్ ధర్మపురి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి (బీజేపీ), బీదా మస్తాన్ రావు (టీడీపీ), సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల కమిటీకి గడ్డం వంశీ కష్ణ (కాంగ్రెస్), కె.ఆర్ సురేష్ రెడ్డి (బీఆర్‌ఎస్), పాకా వెంకట సత్యనారాయణ (బీజేపీ), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిటీకి కడియం కావ్య (కాంగ్రెస్), బైరెడ్డి శబరి (టీడీపీ), బి. పార్థసారథి రెడ్డి (బీఆర్‌ఎస్), పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్‌స్, లా అండ్ జస్టిస్ కమిటీకి ఎం.రఘునందన్ రావు (బీజేపీ), కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి ఆర్. రఘురామ్ రెడ్డి (కాంగ్రెస్), ఎస్.నిరంజన్ రెడ్డి (వైసీపీ) నియామకం అయ్యారు. రక్షణ కమిటీకి కేశినేని శివనాథ్ (టీడీపీ), డి. దామోదర్ రావు (బీఆర్‌ఎస్), ఎనర్జీ కమిటీకి కందూరు రఘువీర్ (కాంగ్రెస్), విదేశీ వ్యవహారాల కమిటీకి డి.కె అరుణ (బీజేపీ), వైఎస్ అవినాష్ రెడ్డి (వైసీపీ), అయోద్య రామిరెడ్డి (వైసీపీ), కె. లక్ష్మణ్ (బీజేపీ), జాన్ బ్రిట్టాస్ (సీపీఐఎం), ఆర్థిక వ్యవహారాల కమిటీకి లావు శ్రీకష్ణదేవరాయులు (టీడీపీ), సీఎం రమేష్ (బీజేపీ), పీవీ మిథున్ రెడ్డి (వైసీపీ), వల్లభనేని బాలశౌరి (జనసేన), వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి (టీడీపీ), వైవి సుబ్బారెడ్డి (వైసీపీ), వినియోగదారు వ్యవహారాల కమిటీకి ఆర్. కష్ణయ్య (బీజేపీ), లేబర్, టెక్స్‌టైల్స్, స్కిల్ డవలప్‌మెంట్ కమిటీకి జి.లక్ష్మినారాయణ (టీడీపీ), పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కమిటీకి పుట్టా మహేష్ కుమార్ (టీడీపీ), మద్దిల గురుమూర్తి (వైసీపీ), వల్లభనేని బాలశౌరి (జనసేన), వి.శివదాసన్ (సీపీఐఎం) నియామకం అయ్యారు.రైల్వే కమిటీకి సీఎం రమేష్ (బీజేపీ), కె.లక్ష్మణ్ (బీజేపీ), ఎం. రఘునాథ్ రెడ్డి (వైసీపీ) నియామకం కాగా, ఈ కమిటీకి చైర్మెన్ గా సీఎం రమేష్ నియామకం అయ్యారు. హౌసింగ్, అర్బన్ వ్యవహారాల కమిటీకి చామల కిరణ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్), మాగుంట శ్రీనివాసులరెడ్డి (టీడీపీ), ఎఎ రహీమ్ (సీపీఐఎం) నియామకం అయ్యారు. ఈ కమిటీకి మాగుంట శ్రీనివాసులరెడ్డి చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కమిటీకి ఈటల రాజేంద్రర్ (బీజేపీ), దగ్గుమల్ల ప్రసాదరావు (టీడీపీ), ఆర్.సచ్చితానంథమ్ (సీపీఐఎం), గ్రామీణాభివద్ధి, పంచాయతీరాజ్ కమిటీకి కె. రాధాకష్ణన్ (సీపీఐఎం), బొగ్గు, గనులు, ఉక్కు కమిటీకి బికె.పార్థసారథి (టీడీపీ), అనిల్ కుమార్ యాదవ్ (కాంగ్రెస్), ఎస్.వెంకటేషన్ (సీపీఐఎం), సామాజిక న్యాయం, సాధికారిత కమిటీకి వి. విజయేంద్ర ప్రసాద్ (ఇండిపెండెంట్) నియామకం అయ్యారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో.. తెలుగు రాష్ట్రాలకు చోటు
- Advertisement -
- Advertisement -