Thursday, October 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్నికల శిక్షణకు రాలేదని..చనిపోయిన ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీస్‌

ఎన్నికల శిక్షణకు రాలేదని..చనిపోయిన ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీస్‌

- Advertisement -

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఘటన

నవతెలంగాణ-గజ్వేల్‌
సుమారు 45 రోజుల క్రితం చనిపోయిన ఉపాధ్యాయుడు.. ఎన్నికల శిక్షణా శిబిరానికి రాలేదని షోకాజ్‌ నోటీస్‌ వచ్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం జాలిగామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉప్పల శ్రీనివాస్‌ ఆగస్టు 14న గుండెపోటుతో మృతి చెందాడు. అయితే అధికారులు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి.. ఈ సమావేశానికి రావాలని ఆయనకు ఆహ్వానం పంపారు. కాగా, ఎన్నికల శిక్షణా శిబిరానికి రాలేదని సంబంధిత శాఖ అధికారులు బుధవారం ఆయన ఇంటికి షోకాజ్‌ నోటీసు పంపించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -