Sunday, May 11, 2025
Homeతెలంగాణ రౌండప్చౌట్ పల్లిలో దేశసైన్యం క్షేమంకోసం ప్రత్యేక హోమం

చౌట్ పల్లిలో దేశసైన్యం క్షేమంకోసం ప్రత్యేక హోమం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని చౌట్ పల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఆదేశాల మేరకు  దేశ సైన్యం క్షేమం కోరుతూ ప్రత్యేక హోమం నిర్వహించారు. స్థానిక శ్రీలక్ష్మి నారాయణస్వామి ఆలయంలో ఈ మేరకు శనివారం వేద పండితులు గంగా ప్రసాద్ దీక్షితులు పర్యవేక్షణలో రాజా గౌతమ్ శర్మ, అమర్నాథ్ చార్యులు ఈ ప్రత్యేక హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్, పాకిస్తాన్ దేశాల ఉద్రిక్తల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశ సైన్యానికి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆశీస్సులు, అనుగ్రహం ఉండాలని కాంక్షిస్తూ ప్రత్యేక హోమం చేసినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలో కూడా ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -