నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్ గ్రామం లో ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత అయినటువంటి తిమ్మాయగారి సుభాష్ రెడ్డి ఆయన సొంత డబ్బుల తో ఆ గ్రామంలో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ మనం ఎంత సంపాదించిన పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చిన అది ఎప్పుడో ఒకప్పుడు దూరమవుతుందని, విద్య అనేది ఎప్పుడు వారితోనే ఉంటుందని దీనిని గమనించి ప్రతి ఒక్కరూ వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానాలలో స్థిరపడేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన స్నేహితులు జనగామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, తుజాల్పూర్ మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్, శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, నాగరాజు రెడ్డి, వెంకట్ రెడ్డి, సిద్ది రెడ్డి, బాపురెడ్డి, భూమా గౌడ్, శ్రవణ్ కుమార్, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.