Thursday, October 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోడ్ అమలు ఎక్కడ..?

కోడ్ అమలు ఎక్కడ..?

- Advertisement -

గ్రామంలో బహిర్గతమైన పార్టీ జెండాలు

అధికారుల నిర్లక్ష్యం పై ప్రజల్లో చర్చ

నవతెలంగాణ ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామంలోని బీటీ రోడ్డు పక్కనే మూడు ప్రధాన పార్టీల గుర్తులు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ జెండాలు బహిరంగంగా దర్శనమిస్తున్నాయి. స్థానిక ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఈ దృశ్యం స్పష్టమవుతోంది.

ప్రతి సారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడల్లా ఇదే తీరుతో గ్రామస్థాయి, మండల స్థాయి అధికారులు ఇదే నిర్లక్ష్యం ప్రదర్శించడం విశేషమని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. “పార్టీ గుర్తులకు ముసుకు తొడుగుతారా లేదా?” అన్న సందేహం గ్రామంలో చర్చనీయాంశమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -