నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. క్రీజులో కెఎల్ రాహుల్ 114 బంతులు ఆడి 53 పరుగులు చేశాడు. కెప్టెన్ శుభమాన్‌గిల్ 42 బంతుల్లో 18 పరగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ (36), సాయి సుదర్శన్ (7) ఔటయ్యారు. జైస్వాల్ తన సహజ శైలిలో ధాటిగా ఆడి జేడన్ సీల్స్ బౌలింగ్‌లో షారు హౌప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాయి సుదర్శన్ 7 పరుగులే చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 41పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.