Friday, October 3, 2025
E-PAPER
Homeజాతీయం5 యుద్ధ విమానాలను కూల్చేశాం: ఎయిర్ చీఫ్

5 యుద్ధ విమానాలను కూల్చేశాం: ఎయిర్ చీఫ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌పై భారత్ సైన్యం చేసిన దాడి గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికా తయారీ F-16, J-17లను భారత్ కూల్చివేసిందని శుక్రవారం వెల్లడించారు. పాకిస్తాన్ కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పారు. పాకిస్తాన్ తన పౌరుల్ని తప్పుదారి పట్టించేందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, భారత్ జెట్లను నాశనం చేశామనే పాక్ వాదనల్ని ఆయన తోసిపుచ్చారు. పాకిస్తాన్ స్వయంగా భారత్‌ను కాల్పుల విరమణ కోరిందని చెప్పారు.

పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం భారత సైనిక శక్తిని, ఖచ్చితత్వానికి నిదర్శనమని చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్‌లో, అమాయక ప్రజలను చంపినందుకు ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోవడం మీరు చూశారు. మేము మా లక్ష్యాన్ని సాధించిన విషయాన్ని ప్రపంచం చూసింది. మేము పాకిస్తాన్ లోపల 300 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించాము. ఆపై వారు (పాకిస్తాన్) కాల్పుల విరమణను కోరారు’’ అని ఏపీ సింగ్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -