- Advertisement -
నవతెలంగాణ-జన్నారం: దసరా పండుగను పురస్కరించుకొని జన్నారం అగ్నిమాపక కేంద్రంలో ఉన్న వాహనాలకు అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజిన్, బైకులు, ఇతర పరికరాలకు హారతి ఇచ్చి పూజలు చేశారు. ప్రతి సంవత్సరం ఈ ఆయుధ పూజ చేయడం ఆనవాయితీగా వస్తోందని సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -