నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్- భారత్ వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఆ రెండు దేశాలు సంఘర్షణకు ముగింపు పలికాయని రాసుకొచ్చారు. ఈ రెండు దేశాల మధ్యవర్తిత్వం వహించినందుకు సంతోషంగా ఉందని, ఇరుదేశాలు సమయస్ఫూర్తిని ప్రదర్శించాయని, పాక్-భారత్ దేశాలకు ధన్యావాదాలని పేర్కొన్నారు. ఇదివరకే భారత్–పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా ఘర్షణలకు తెరదించాలని భారత్, పాక్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తన వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. భారత్, పాక్ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని ప్రకటించారు.
కాల్పుల విరమణకు భారత్- పాక్ ఓకే: ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES