Sunday, May 11, 2025
Homeతెలంగాణ రౌండప్సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్న ప్రయివేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి ..

సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్న ప్రయివేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి ..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపు పేరుతో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు శనివారం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు సమ్మర్ క్యాంప్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసపూరిత మాటలతో నమ్మించి తరగతులు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవటం లేదని అన్నారు.అలాగే ఒకప్పుడు వేసవి సెలవుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు క్రీడలు, ఇతర నైపుణ్యాలు నేర్చుకునే వారు కానీ నేడు ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ఒక పరిశ్రమలో తయ్యారు అయ్యే ఒక వస్తువుగా చూస్తూ, విద్యార్థులపై ర్యాంక్ లు , మార్కులు అని మానసిక ఒత్తిడికి గురి చెయ్యటం వలన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న , ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల ఆగడాలకు అడ్డు ,అదుపు లేదని అన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి సమ్మర్ క్యాంప్ పేరుతో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు లేని యెడల సమ్మర్ క్యాంప్ పేరుతో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర సహాయ కార్యదర్శి శివ,సంతోష్, సాయి ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -