Friday, October 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుRamreddy Damodar Reddy : మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం నివాళి

Ramreddy Damodar Reddy : మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం నివాళి

- Advertisement -




నవతెలంగాణ హైదరాబాద్‌: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం హైదారాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దామోదర్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రజలు, నాయకుల సందర్శనార్థం ఇవాళ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. దామోదర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు.

దామోదర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, రైతు కమిషన్‌ ఛైర్మన్‌ కోదండ రెడ్డి తదితరులు ఉన్నారు. దామోదర్ రెడ్డి, తాను ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టామని, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని కోదండరెడ్డి కొనియాడారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని… కోలుకుని తిరిగి వస్తారని తాము భావించామన్నారు. ఆయన మృతి ఉమ్మడి నల్గొండ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -