Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్హిట్ అండ్ రన్ బిఎన్ఎస్ సెక్షన్ 106(1)(2) రద్దు చేయాలి

హిట్ అండ్ రన్ బిఎన్ఎస్ సెక్షన్ 106(1)(2) రద్దు చేయాలి

- Advertisement -

దేశవ్యాప్త సమ్మెలో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: ట్రాన్స్ పోర్ట్ కార్మికులను కఠినంగా శిక్షించే హిట్ అండ్ రన్ బిఎన్ఎస్ సెక్షన్ 106(1)(2) రద్దు చేయాలి అని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఖిల్లా చౌరస్తా వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు మాట్లాడుతూ..రోడ్ ప్రమాదాలు తగ్గాలంటే డ్రైవర్ లను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన హిట్ అండ్ రన్ బి.ఎన్.ఎస్ సెక్షన్ 106 (1(2) లను రద్దు చేయాలని కటారి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత (బి ఎన్ ఎస్) చట్టంలోని సెక్షన్ 106(1)(2) ల ప్రకారం రోడ్ ప్రమాదాలు జరగడానికి డ్రైవర్ లే కారణమని భావించి డ్రైవర్ లను కఠినంగా శిక్షించాలని 10 సంవత్సరాలు జైలు శిక్ష , ఏడు లక్ష రూపాయల ఫైన్ విధించే విధంగా తీసుకొచ్చిన సెక్షన్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగ కార్మికులు నిత్యం ప్రమాదాలకు గురౌతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయని కార్మికులను అదుకోవడం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రోడ్ ప్రమాదాలలో మరణించిన,గాయపడిన ప్రమాద బీమా కంపనీల ద్వారా గతంలో బీమా వచ్చెదని నేడు బీమా పై కేంద్రం సిలింగ్ పెట్టి డ్రైవర్ లపైన ఫెనాల్టీ ఏడు లక్షల రూపాయలని వేసి కార్మికుల కు నష్టం చేసే నూతన మోటారు వాహన చట్టం-2019 ని సవరించాలని, కార్మిక హక్కులను కాలరాసే , పని గంటలు పెంచే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఇతర కార్మిక డిమాండ్స్ పై మే 20 న జరిగే దేశవ్యాపిత సమ్మెలో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -