Friday, October 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్కెట్ కమిటీ చైర్మన్ ను పరామర్శించిన ఈరవత్రి అనిల్

మార్కెట్ కమిటీ చైర్మన్ ను పరామర్శించిన ఈరవత్రి అనిల్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి

మండలంలోని నాగాపూర్ లో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్యను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ శుక్రవారం పరామర్శించారు. ఇటీవల గుండెపోటుకు గురైన పాలెపు నర్సయ్య సర్జరీ అనంతరం ఆసుపత్రి నుండి వచ్చి ఇంటి వద్ద కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ నరసయ్యను పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోని ప్రజలకు తన వంతు సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, మైనార్టీ సెల్ జిల్లా గౌరవ అధ్యక్షులు అబ్దుల్ రఫీ, నాయకులు నల్ల గణేష్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -