నవతెలంగాణ జన్నారం:
స్థానిక నటరాజ కళాక్షేత్రం విద్యార్థులు తమ ప్రతిభను మరోసారి నిరూపించారు. ఈ కళాక్షేత్రానికి చెందిన విద్యార్థులు సహస్ర గౌడ్, వర్షిణి, మోక్షిత్ లు ప్రతిష్టాత్మకమైన డి 20 రియాల్టీ డాన్స్ షోలో ఎంపికై అద్భుతమైన నృత్య ప్రదర్శన అందించారు. వారి ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా న్యాయనిర్ణేతల ప్రశంసలు పొందాయి. చిన్న వయసులోనే పెద్ద వేదికపై నిలబడి తమ ప్రతిభను చాటుకోవడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా డ్యాన్స్ మాస్టర్ నర్మద గౌడ్ మాట్లాడుతూ – “మా విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. జన్నారం నుంచి దేశస్థాయిలో తమ ప్రతిభ చాటుకోవడం గర్వకారణం. భవిష్యత్తులో మరింత ఉన్నత వేదికలపై నిలబడతారని నమ్మకం ఉంది” అని పేర్కొన్నారు. విద్యార్థుల విజయంపై స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.