Saturday, October 4, 2025
E-PAPER
Homeజాతీయంతొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలి

తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలి

- Advertisement -

కరూర్‌ బాధిత కుటుంబాలకు సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం పరామర్శ

చెన్నై : కరూర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాలను సీపీఐ(ఎం) అత్యున్నత ప్రతినిధి బృందం శుక్రవారం పరామర్శించింది. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. సంస్థాగత లోపాలపై విమర్శలు చేసింది. ఈ బృందంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు యు వాసుకి, కేంద్ర కమిటీ సభ్యులు, లోక్‌సభ గ్రూపు లీడర్‌ కె రాథాకృష్ణన్‌, దిండిగుల్‌ ఎంపీ ఆర్‌ సచిదానందం, నాగపట్టినం ఎమ్మెల్యే నాగై మలై, రాజ్యసభ సభ్యులు-కేరళ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్‌ వి శివదాసన్‌ ఉన్నారు. అలాగే ఈ బృందంతో పాటు తమిళనాడు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌ బాలా, జిల్లా కార్యదర్శి ఎం జోతిబసు, కరూర్‌ మున్సిపల్‌ కార్యదర్శి ఎం తండపాణి, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వివిధ ప్రాంతాలో ఉన్న బాధిత కుటుంబాలను ప్రతినిధి బృందం పరామర్శించింది.

వేలుసామిపురంలోని ఇందిరానగర్‌లో తొక్కిసలా ఘటనలో మృతి చెందిన రెండేండ్ల బాలుడు విష్టు కుటుంబాన్ని, ఎమూర్‌ పుడూర్‌ వద్ద మృతుడు చంద్ర కుటుంబాన్ని పరామర్శించింది. ఈ పరామర్శలో చంద్ర కుమారుడు శక్తికుమార్‌ రెండేండ్ల క్రితమే చదువు మానివేసిన విషయాన్ని ఎంఎ బేబి, ప్రతినిధి బృందం గుర్తించారు. చదువును తిరిగి కొనసాగించడమే తల్లి చంద్రకు ఇచ్చే నివాళి అని, చదువుకు అవసరమైన సాయం చేస్తామని తెలిపారు. శక్తికుమార్‌ విద్యా బాధ్యతలను పార్టీ ఏరియా కమిటీ తీసుకుంది. శక్తికుమార్‌ విద్యా పురోగతిని పరిశీలించడానికి ఏడాది తరువాత మళ్లీ వస్తానని బేబి తెలిపారు. అలాగే, మరికొన్ని కుటుంబాలను కూడా బృందం పరామర్శించింది. శస్త్రచిక్సిత జరిగిన బాలుడు చికిత్సపొందుతున్న ఆస్పత్రిని కూడా బృందం సందర్శించింది.

తమిళనాడు ప్రభుత్వ ప్రతిస్పందనపై ప్రశంసలు
తొక్కిసలాట ఘటన తరువాత ఎంకె స్టాలిన్‌ ప్రభుత్వం చేపట్టిన తక్షణ చర్యలను బేబీ ప్రశంసించారు. అలాగే ఈ సంఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించలేదని పేర్కొన్నారు. కీలకమైన మంత్రులను రక్షణ, సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం పంపిందని, అదే రోజు అర్ధరాత్రి సంఘటనా స్థలాన్ని ముఖ్య మంత్రి స్వయంగా సందర్శించారని బేబీ గుర్తు చేశారు. అదేవిధంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, నర్సులు అద్భుతమైన పని చేశారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దర్ని మినహా మిగిలిన అందర్నీ రక్షించారని, ప్రస్తుతం ఒక వ్యక్తి మాత్రమే చికిత్స పొందుతున్నారని చెప్పారు. అలాగే ఎనిమిది గంటల్లోపు దాదాపు అన్ని పోస్టుమార్టమ్‌లను పూర్త య్యాయని, ఇలాంటి పరిపాలన ఎక్కడా చూపడలేదని, ఇది ఒక రికార్డు అని పేర్కొన్నారు.

నిర్వహకులపై తీవ్రస్థాయిలో విమర్శలు
ప్రభుత్వ ప్రతిస్పందనను ప్రశంసించిన ఎంఎ బేబీ మరోవైపు వేడుక నిర్వాహకులపై తీవ్రమైన విమర్శలు చేశారు. అధికంగా వచ్చిన జనసమూహాన్ని నియంత్రించడానికి ఎలాంంటి చర్యలు తీసుకులేదని, తగినంత స్వచ్ఛంద సేవకుల్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. విజయ్ ఉద్దేశపూర్వకంగానే ఏడు గంటల ఆలస్యంగా వచ్చారని విమర్శించారు. అలాగే జనాలపై విజయ్ కొన్ని నీటి బాటిళ్లను విసిరివేయడంతో వాటిని పట్టుకోవడానికి జనాల మధ్య పెనుగులాట జరిగిందని బేబి విమర్శించారు. ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఇటీవల మధురైలో తమ పార్టీ మహాసభను విజయవంతంగా నిర్వహించామని, కానీ ఇక్కడ అలాంటి సమన్వయం లేదని విమర్శించారు. అలాగే ఘటన జరిగిన సందర్భంలోనూ, ఘటన జరిగిన మూడు రోజులు తరువాత విజయ్ వీడియో సందేశాన్ని విడుదల చేయడాన్ని ఎంఎ బేబీ ఖండించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -