Saturday, October 4, 2025
E-PAPER
Homeసినిమాసరికొత్త 'అనుమాన పక్షి'

సరికొత్త ‘అనుమాన పక్షి’

- Advertisement -

రచయిత-దర్శకుడు విమల్‌ కృష్ణ 2022లో ‘టీజే టిల్లు’ తో అద్భుతమైన అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఆ పాత్ర తెలుగు రాష్ట్రాల్లో ఇంటి పేరుగా మారింది.
ఇప్పుడు విమల్‌ కృష్ణ మరోసారి సర్‌ప్రైజ్‌ చేయడానికి రెడీ అయ్యారు. ఈసారి డిఫరెంట్‌ స్టయిల్‌లో మరొక విచిత్రమైన పాత్రను పరిచయం చేశాడు. ఈ అప్‌ కమింగ్‌ ప్రాజెక్ట్‌ను చిలకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఇది ‘ఆ ఒక్కటి అడక్కు’ వంటి చిత్రాల తర్వాత ఈ బ్యానర్‌లో 4వ వెంచర్‌. రాజీవ్‌ చిలకా, రాజేష్‌ జగ్తియాని, హిరాచంద్‌ దండ్‌ నిర్మిస్తున్నారు. రాగ్‌ మయూర్‌ హీరోగా నటిస్తుండగా, మెరిన్‌ ఫిలిప్‌ హీరోయిన్‌. దసరా శుభ సందర్భంగా, నిర్మాతలు తమ అప్‌ కమింగ్‌ మూవీ టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు.

‘అనుమాన పక్షి’ అనే టైటిల్‌ రాగ్‌ మయూర్‌ పాత్ర విచిత్రమైన స్వభావాన్ని సూచిస్తుంది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఒక కామిక్‌ పుస్తక బ్యూటీని కలిగి ఉంది. రంగురంగుల ఆలోచన బుడగలు ఆఫ్‌బీట్‌, హిలేరియస్‌ ప్రశ్నలు సినిమా యూనిక్‌నెస్‌ని ప్రజెంట్‌ చేస్తోంది. మోషన్‌ పోస్టర్‌లోని విజువల్స్‌, శ్రీ చరణ్‌ పాకాల సంగీతం ఎంటర్‌టైమెంట్‌ డబుల్‌ చేశాయి. ప్రిన్స్‌ సెసిల్‌, అనన్య, చరిత్‌ ఈ కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సునీల్‌ కుమార్‌ నామా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జెకె మూర్తి ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అభినవ్‌ కునపరెడ్డి ఎడిటర్‌. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. అనన్య, చరిత్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ తదితరులు నటిస్తున ఈచిత్రానికి సహ నిర్మాత – భరత్‌ లక్ష్మీపతి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – ప్రశాంత్‌ మండవ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -