తాజాగా ‘ఓజీ’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సుజీత్. ఆయన దర్శకత్వంలో నాని కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇది నాని హీరోగా నటిస్తున్న 34వ చిత్రం. ఈ కొత్త చిత్రాన్ని ప్రొడ్యూసర్ వెంకట్ బోయనపల్లి (నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్), అలాగే నాని స్వంత నిర్మాణ సంస్థ యూనానిమస్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. దసరా శుభ సందర్భంగా ఈ సినిమా లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకకు హీరో వెంకటేష్ హాజరై, ఫస్ట్ క్లాప్ కొట్టి బెస్ట్ విషెష్ అందించారు. నాని తండ్రి రాంబాబు ఘంటా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాని, నిర్మాత వెంకట్ బోయనపల్లి కలిసి స్క్రిప్ట్‌ను దర్శకుడు సుజీత్‌కి అందించారు. ఫస్ట్ షాట్‌కి దర్శకులు రాహుల్ సంకత్యాన్, శ్రీకాంత్ ఒదెల, శౌర్యువ్ కలిసి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ వేడుకకు దర్శకుడు రామ్ జగదీష్, నిర్మాత సుధాకర్ చెరుకూరితో పాటు పరిశ్రమలోని ప్రముఖులు హాజరయ్యారు. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్, టెక్నికల్ విలువలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం విజువల్ స్పెక్టకిల్‌గా నిలవనుంది. యాక్షన్, ఎమోషన్, నాని సిగేచర్ హ్యూమర్ మేళవింపుతో అన్ని వయసుల ప్రేక్షకులకు నచ్చే యూనివర్సల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. స్క్రిప్ట్‌లో యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్ మెంట్‌ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ, నానిని ఎప్పుడూ చూడని పాత్రలో చూపించబోతున్నారు దర్శకుడు సుజీత్. ఈ ప్రాజెక్ట్ ప్రతీ ఎలిమెంట్ హయ్యెస్ట్ స్టాండర్డ్స్‌కి చేరుకునేలా తీర్చిదిద్దుతామని నిర్మాత వెంకట్ బోయనపల్లి తెలిపారు.
‘ఓజీ’ దర్శకుడితో నాని కొత్త సినిమా షురూ
- Advertisement -
- Advertisement -