Saturday, October 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవాట్సాప్‌లో బుకింగ్‌.. ఆన్‌లైన్‌లో పేమెంట్స్‌

వాట్సాప్‌లో బుకింగ్‌.. ఆన్‌లైన్‌లో పేమెంట్స్‌

- Advertisement -

డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్టు
50గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం : టాస్క్‌ఫోర్సు అదనపు డీసీపీ వైవీఎస్‌ సుధీంద్ర వెల్లడి

నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలీసులకు చిక్కకుండా ప్రధాన డ్రగ్స్‌ డీలర్‌ చెప్పిన విధంగా వాట్సాప్‌లో డ్రగ్స్‌ బుకింగ్‌లు, ఆన్‌లైన్‌లో పేమెంట్స్‌ను తీసుకుని డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను నార్కోటెక్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ (హెచ్‌ఎన్‌ఈడబ్య్లూ) వింగ్‌ అరెస్టు చేసింది. నిందితుల నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, రూ.830 నగదుతోపాటు రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్సు అదనపు డీసీపీ వైవీఎస్‌ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడకు చెందిన మొహమ్మద్‌ ఉస్మాన్‌ అలియాజ్‌ అబ్బు, కర్నాటకకు చెందిన రాహుల్‌ ఒక ముఠాగా ఏర్పాడ్డారు. 10వ తరగతి వరకు చదువుకున్న ఉస్మాన్‌ బేబీ స్టోర్‌లో చేరాడు. అయితే ఆ వ్యాపారంలో నష్టాలు రావడంతో యజమాని షోరూంను క్లోజ్‌ చేశాడు. దాంతో ఉస్మాన్‌కు ఆర్థిక ఇబ్బందులు తలెత్తగా సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో కేరళకు చెందిన డ్రగ్స్‌ సప్లయర్‌ అశ్విన్‌తో పరిచయం ఏర్పడింది. బెహరాన్‌లో ఉన్న అశ్విన్‌ ఆదేశాలతో ఉస్మాన్‌తో పాటు రాహుల్‌ కూడా డ్రగ్స్‌ సప్లరు చేస్తున్నాడు. బెహరాన్‌ నుంచే వాట్సాప్‌లో డ్రగ్స్‌ బుక్‌ చేస్తున్న అశ్విన్‌.. ఉస్మాన్‌, రాహుల్‌కు గ్రాముకు రూ.2వేలు తీసుకునేవాడు. అశ్విన్‌ పంపించిన ఎండీఎంఏ డ్రగ్స్‌ను రిసీవ్‌ చేసుకుంటున్న ఇద్దరు నిందితులు హైదరాబాద్‌లో రూ.8000 నుంచి రూ.10,000కు విక్రయిస్తూ, ఆన్‌లైన్‌లో పేమెంట్స్‌ తీసుకుంటున్నారు. పక్కా సమాచారం అందుకున్న నార్కోటెక్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బృందం ఇద్దరు నిందితులను చాదర్‌ఘాట్‌ పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అశ్విన్‌ కోసం గాలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎన్‌ఈడబ్య్లూ ఇన్‌స్పెక్టర్‌ డ్యానియేల్‌, ఎస్‌ఐ సి.వెంకట రాములుతోపాటు చాదర్‌ఘాట్‌ ఎస్‌హెచ్‌వో బ్రాహ్మామురారీ కాశిని, ఎస్‌ఐ క్రిష్ణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -