Saturday, October 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపసివాళ్లకు యుద్ధ గండం

పసివాళ్లకు యుద్ధ గండం

- Advertisement -

ఇజ్రాయిల్‌ దమనకాండలో హరిస్తున్న ప్రాణాలు
వైద్యసేవలు అందక మృత్యుఒడిలోకి
జాతివిధ్వంస విధానాల నుంచి కాపాడండి..అంతర్జాతీయ సమాజం డిమాండ్‌


గాజా: గత 24 నెలలుగా ఇజ్రాయిల్‌ దమనకాండలో చిక్కుకున్న 2.2 మిలియన్లకు పైగా పాలస్తీనియన్ల పరిస్థితి అగమ్యగోచరంలా మారింది. ఏ పాపం చేయని పసివాళ్ల ప్రాణాలకు యుద్ధ గండం పొంచి ఉంది. ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణహౌమంలో చిన్నారుల బతుకులకే కాదు. భావితరాలకు ముప్పుగా మారిందనిసెంట్రల్‌ గాజాలోని నుసెయిరాట్‌లోని డాక్టర్‌ ఖామిస్‌ ఎలెస్సీ పేర్కొన్నారు. వారిని ప్రాణాలను కాపాడటానికి సత్వరమే చర్యలు తీసుకోవడానికి ప్రపంచ నాయకులంతా ముందుకు రావాల్సిన అవసరమున్నదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ”వారు పాలస్తీనియన్లు తప్ప ఈ యుద్ధంతో వారికి సంబంధం లేదు. వారు ఆకలితో చనిపోతున్నారు.

ఇప్పుడు వారికి వైద్యం , గౌరవప్రదమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిరాకరించబడుతోంది. అని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్‌ 2023 నుంచి ఇజ్రాయిల్‌ దాడుల్లో గాయపడిన 170,000 మంది కాకుండా, 350,000 మంది దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నా రు. ఇజ్రాయిల్‌ దిగ్బంధనం, నిరంతర బాంబు దాడుల కారణంగా సరైన చికిత్స పొందలేక పోతున్నారని పేర్కొన్నారు. కాలిన గాయాల బాధితులకు ”పరిశుభ్రత లేకపోవడం, పరిశుభ్రమైన నీరు అందట్లేదు. యాంటీబయాటిక్స్‌ లేవు. పోషకాహారం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా ప్రబలుతోంది” అని ఎలెస్సీ అన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రోగులు వ్యాధులతో పోరాటలేరు. ఆస్పత్రులు కూడా పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందించలేకపోతున్నాయి. ఉన్న కొద్దిపాటి ఆస్పత్రుల్లోనూ ఆశించిన మేర వైద్యాన్ని అందించలేకపోతున్నామని వైద్యులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -