Saturday, October 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసాగర్‌ 26 గేట్లు ఎత్తి నీటి విడుదల

సాగర్‌ 26 గేట్లు ఎత్తి నీటి విడుదల

- Advertisement -

నవతెలంగాణ-నాగార్జునసాగర్‌
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వస్తున్న వరద నీటిని గేట్లను ఐదడుగుల మేరకు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి నాగార్జున సాగర్‌కు 2,61,176 క్యూసెక్కుల నీరు వస్తుండగా సాగర్‌ జలాశయం నుంచి 2,56,244 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ డ్యామ్‌ 26 క్రస్ట్‌ గేట్లను ఐదడుగుల మేరకు ఎత్తి 2,02,956 క్యూసెక్కుల నీటిని దిగునకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం నుండి కుడి కాలువ ద్వారా 10,040 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 7937 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా 33,211 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ జలాశయంలో 587.20 అడుగుల నీటిమట్టం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -