- Advertisement -
నవతెలంగాణ-మర్కుక్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తమ నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్ధించారు. మాజీ హౌం మంత్రి మెహమూద్ అలీ.. కేసీఆర్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -