నవతెలంగాణ హలియా
స్థానిక సంస్థల ఎన్నికల్లో నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చినపాక లక్ష్మినారాయణ అన్నారు. శుక్రవారం హాలియా లోని పార్టీ కార్యాలయం జిల్లా కమిటి సభ్యులు కొండేటి శ్రీను అధ్యక్షతన జరిగిన మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో ప్రజా సమస్యలను వెలికి తీయడంలో అధికారంలో ఎవరు ఉన్నా, పరిష్కరానికి కృషి చేసేది కమ్యూనిస్ట్ నాయకులే అని.. ఆయన అన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడే కనపడే పార్టీలు, నాయకులు ఆ తరువాత ప్రజా సమస్యలను పట్టించుకోరు అని, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తోనే ఉండే నాయకులను, ప్రజా సమస్య ల పట్ల అవగాహనా ఉన్న నిజాయితీ పరులను ఎన్నుకోవాలని, వారు కోరారు. ఈ కార్యక్రమం లో మండల కార్యదర్శులు దైద శ్రీను, కందుకూరి కోటేష్, దుబ్బ రాంచంద్రయ్య, జఠావత్ రవి నాయక్* తదితరులు పాల్గొన్నారు.