నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్, డోంగ్లి, మండలాలకు జడ్పిటిసిల అభ్యర్థులు ఆయా మండలాల్లోని ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గెలుపు గుర్రాల కోసం అభ్యర్థులను అన్వేషిస్తున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపిక కోసం సభలు సమావేశాలు నిర్వహించుకుంటున్నట్టు సమాచారం. మద్నూర్ మండలంలో ఒక జడ్పిటిసి 12 ఎంపీటీసీ స్థానాలకు అలాగే డోంగ్లి మండలంలో ఒక జడ్పిటిసి 5 ఎంపీటీసీ స్థానాలకు పోటీలో దింపేందుకు గెలుపే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు గెలుపు గుర్రాల కోసం ముమ్మర ప్రయత్నాలతో అన్వేషిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు పార్టీలు కూడా తమ తమ అభ్యర్థుల గెలుపుల కోసం ప్రత్యేకంగా పట్టుదలతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో జంపు జలానిలా ఆరాటాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ గట్టుకు వస్తావా నాగన్న ఆ గట్టుకు వెళ్తావా నాగన్న అనే రీతిలో పార్టీలు మారిన నాయకులకు టికెట్లు ఇవ్వాలా వద్ద అనే దానిపై మూడు పార్టీలు హై కామాండ్లు ముమ్మర చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి గ్రామంలో నేనా నువ్వా అనే రీతిలో జరగనున్నాయి అన్ని పార్టీలు కూడా గెలుపు ల కోసం ముమ్మర కసరత్తులు ప్రారంభించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు దొక లేదనే ధీమాలో ఉన్నప్పటికీ అధికార పార్టీకి దిటైనా సమాధానం ఇవ్వడమే తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీజేపీ, పార్టీలు లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు.
ముందుగా అభ్యర్థుల ఎంపిక ఏ పార్టీ విడుదల చేస్తుందో దానిపై ఇతర పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఎదురుచూపుల్లో ఉన్నారు. ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీల నాయకులు ముమ్మరంగా కసరత్తులు చేపట్టారు. ఎంపీటీసీ స్థానాలకు కొన్నింటిలో ఆయా పార్టీల్లో అభ్యర్థుల పేర్లు వినబడుతున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో కావనే చర్చలు కూడా వినపడుతున్నాయి. ఏది ఏమైనా అభ్యర్థులు ఎంపిక ఈనెల తొమ్మిదవ తేదీ వరకు వేచి చూడవలసిందే.