ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
పర్యావరణ హిత బ్యాగులు సరఫరా
నవతెలంగాణ–మల్హర్ రావు
ఎన్నికల కోడ్ మూలంగా మండలంలో తెల్లరేషన్ కార్డుదారులకు పర్యావరణ హిత సంచుల పంపిణీ నిలిచిపోయింది. మండలంలో ఉన్న 19 రేషన్ దుకాణాల్లో 9061 తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. రేషన్ వినియోగదారులకు సరఫరా చేయడానికి గాను మండలానికి మొత్తం 9061వేల సంచులు సరఫరా అయ్యాయి. అక్టోబర్ నెల కోటాతో పాటు సంచులు వినియోగదారులకు అందజేయాలని మొదట్లో పౌర సరఫరాలశాఖ ఆదేశాలు జారీ చేసింది.
సదరు సంచిపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభయహస్తం చక్రం, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ముద్రించారు. కొన్ని రేషన్ దుకాణాలకు సంచులు సరఫరా చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో లబ్ధిదారులకు సంచులు పంపిణీ చేయవద్దని తాజాగా పౌర సరఫరాలశాఖ ఆదేశాలు జారీ చేసింది.
కోడ్ ముగిసిన తర్వాతే : పౌర సరఫరాల శాఖ అధికారులు
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రేషన్ వినియోగదారులకు పర్యావరణ హిత సంచుల సరఫరా నిలిపివేశాం. ఈమేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కోడ్ ముగిసిన తరు వాత లబ్ధిదారులకు అందజేస్తాం.